తెలంగాణ’లో ‘జనసేన’తో కలిసి పనిచేయాలని ఉందన్న సీపీఎం నేత తమ్మినేని

  • పవన్ కల్యాణ్ కు ఓ లేఖ రాసిన తమ్మినేని
  • ఏపీలో మాదిరి తెలంగాణలోనూ కలిసి పని చేద్దాం 
  • ఈ లేఖపై రాజకీయ వర్గాల్లో చర్చ
తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీతో కలసి పని చేయాలని ఉందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ మేరకు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు ఓ లేఖ రాశారు. ఏపీలో మాదిరి తెలంగాణలోనూ కలిసి పనిచేద్దామని ఆ లేఖలో కోరారు.

కాగా, ఇంతకుముందు, పవన్ కల్యాణ్ ని తమ్మినేని వీరభద్రం కలిశారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్ ఏపీలో తన పోరాట యాత్రలో బిజీబిజీ అయిపోయారు. ప్రస్తుతం ‘తెలంగాణ’లో ముందస్తు ఎన్నికలు వస్తాయన్న ఊహాగానాలు కొనసాగుతున్న నేపథ్యంలో పవన్ కు తమ్మినేని లేఖ రాయడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.
Go Back to Shorts
tammineni
Pawan Kalyan

More Telugu News